- ఉద్యమాల తొలిపొద్దు కృష్ణ మాదిగ కు స్వాగతం
- ఈనెల 13 న చలో హైదరాబాదు
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర జాతీయ నాయకులు యాదగిరి మాదిగ పిలుపు
దేశరాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు నిచ్చిన తరువాత వర్గీకరణ సాధించిన సామాజిక ఉద్యమాల సూర్యుడు మంద కృష్ణ మాదిగ ఈనెల 13న హైదరాబాదు గడ్డమీద అడుగు పెడుతున్న సందర్భంగా ఘనంగా స్వాగతం చెప్పేందుకు ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర జాతీయ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ పిలుపునిచ్చారు. మడమ తిప్పని పోరాటం ద్వారానే ముప్పైఏండ్ల సుధీర్ఘ దండోర ఉద్యమకల నెరవేరిందని తెలియజేస్తున్నామని, కృష్ణ మాదిగ నాయకత్వంలో అలుపెరుగని పోరాట ఫలితమే ఈ విజయమన్నారు. మాదిగలు, ఉపకులాల నాయకులు తమ డప్పు చప్పుళ్ళతో ఆత్మ గౌరవాన్ని చాటుకునేందుకు లక్షలాదిగ తరలి రావాలని ఎమ్మార్పీఎస్ నాయకులు యాదగిరి మాదిగ తెలిపారు.