అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కేంద్రంలోని శివాలయం వద్ద నుండి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు దళితుల సమస్యల పైన దళితులకు ఇంటి నివేష స్థలాలు, గృహములు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు చేసి ఎన్ ఎస్ ఎఫ్ డి సి పథకం ద్వారా మొక్కలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాలను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బోరు, మోటర్లు, పైపులైన్లు వేసి ఉచిత విద్యుత్తును అందించాలని, గ్రామాలలో నాటుసారాయిని దిమ్మగుడి ఈరన్నపల్లి చిత్ర సేడు చిట్టూరు కొండూరు మొదలగు గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపైన చర్యలు తీసుకొని, గత ప్రభుత్వంలో అక్రమ కేసులు వెంటనే రద్దు చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్ తాసిల్దారు కార్యాలయాలకు ర్యాలీగా వచ్చి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చింతా పురుషోత్తం ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల కొండయ్య పెద్దవడుగూరు మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు గూడూరు రంగస్వామి పెద్దవడుగూరు ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు అంజి తదితరులు పాల్గొన్నారు
