మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా, ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చీకుపల్లి వద్ద జాతీయ రహదారిపై విస్తృతంగా వాహనాలు తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటాపురం సిఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో, వచ్చే పోయే వాహనాలను నిశితంగా తనిఖీలు నిర్వహించి, అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. వాజేడు ఎస్సై రుద్ర హరీష్ తనిఖీ ల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, పరిమిత సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవాలని, ప్రతి ఒక్కరు బండి కాగితాలు, లైసెన్సులు కలిగి ఉండాలని, ఈ సందర్భంగా ఇంధన శకట వాహనదారులకు అవగాహన కల్పిస్తూ, శకట చోథకులకు రోడ్డు ప్రయాణ భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వాజెడు ఎస్సై రుద్ర హరీస్ వాజేడు పి.ఎస్. సివిల్ పోలీస్ సిబ్బంది, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు వాహనాల తనిఖీల కార్యక్రమంలో పాల్గొన్నారు.