ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద గల తెలంగాణ నయాగారగా పేరుగాంచిన బొగత జలపాతo వద్ద పర్యాటకులు సందడి చేశారు. రెండవ శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవు కావడం వలన పర్యాటకులు అధికంగా తరలివచ్చారు.హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల నుండి వచ్చే పర్యాటకులకు దట్టమైన అడవుల మధ్య నుండి పాల ధారల మాదిరిగా కనువిందు చేస్తూ ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది.