భీమవరం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. దాదాపు రూ. 10 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. ఉండ్రాజవరంలో 3.3 ఎకరాల భూమి, భీమవరంలో జీప్లస్ 1 భవనం, తణుకులో జీప్లస్ 1 భవనం, ఇంట్లో రూ. 20 లక్షల నగదు, అర కేజీ బంగారం, 2 కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.