- శృంగవరపుకోట, బొడ్డవర, చిలకలగెడ్డ నుంచి గిరిజన ప్రాంతకు మాంసం తరలింపు.
- వారపు సంతలే వీళ్ళ టార్గెట్
- మోసపోతున్న గిరిజనలు
అల్లూరి జిల్లా, అనంతగిరి,ది రిపోర్టర్ : శృంగవరపుకోట, బొడ్డవర, చిలకలగెడ్డ ( దాసరి తోట ) ప్రాంతాల నుండీ గిరిజన వారపు సంతల్లో కాశీపట్నం, డముకు, అనంతగిరి, సుంకర మెట్ట, లోతేరు, అరకు, ప్రాంతలకు జోరుగా టార్గెట్ పెట్టుకొని కేటుగాళ్ళు అడవి వేట మాంసం పేరుతో గ్రామ పంది మాసం, ఇతర మాంసం ఇతర మాసాలు కలిపి విక్రయిస్తున్నాట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. అడవి పంది, దుక్కు, ఇతర మాసం అనీ గ్రామ పంది మాసం వారానికి మూడు నాలుగు రోజులు విక్రయం చేసి సొమ్ము చేసుకుంటున్నారు. మరి కొంత మంది కేటుగాళ్ళు వివిధ కొండిభ, వెంగడ, వాలసి, పెద్దబిడ్డ, మొదలగు గిరిజన గ్రామాల్లో గుట్టు చప్పుడుగా విక్రయిస్తున్నట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. తక్షణమే సంబంధిత జిల్లా అధికారులు స్పందించి కల్తీ మాసం విక్రయిస్తున్న కేటుగాళ్ల పైన చర్యలు చేపట్టి గిరిజన ప్రజాఆరోగ్యాన్ని,మనోభావాన్ని కాపాడాలని ప్రజలు వాపోతున్నారు.