కరీంనగర్ జిల్లా: బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో పోలీస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కరీంనగర్ టౌన్ ఎస్సై మామిడాల సురేందర్ సతీమణి నవ్య ఆధ్వర్యంలో తన సొంత గ్రామంలో నిర్మించిన నాగదేవత ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా హోమం నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి, గన్నేరువరం మండల ప్రెస్ క్లబ్ సభ్యులు,వివిధ రాజకీయ నాయకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.