నాగర్ కర్నూల్ జిల్లా : జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డు లో గల వక్ఫ్ కాంప్లెక్స్ ఖబరుస్తాన్ (స్మశాన వాటిక) లో ఈరోజు ఓ గొర్రెల కాపరి తన గొర్రెల ను మేపుతుండగా, అక్కడికి చేరుకున్న కొంతమంది అల్లరి మూకలు (మస్జిద్ కమిటీ సభ్యులు,ఉద్యోగులు) మా ఖబరస్థాన్లో గొర్రెలను మేప వద్దు అని అరుస్తూ, ఆ గొర్రెల కాపరి పై విచక్షణారహితంగా దాడికి దిగారు. దీంతో ఆ గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు అయ్యి, రక్తస్రావం జరిగింది.. ఇది గమనించిన మరి కొంతమంది ముస్లింలు సంఘటన స్థలానికి చేరుకొని ఆ (ముస్లిం) అల్లరి మూకలను అక్కడి నుంచి చెదరగొట్టి, గొర్రెల కాపరిని ఆసుపత్రికి తీసుకొని ప్రథమ చికిత్స అందించారు.