- ఆస్తికోసం కన్నకొడుకే నే హతమార్చడానికి ప్రయత్నించ్చిన కన్న తండ్రి, తమ్ముడు.కుటుంబ సభ్యులు.
పల్నాడు జిల్లా నకేరికల్ మండలం దేశవరం గ్రామం లో కొండ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పై కన్నతండ్రే తమ్ముడు వారి కుటుంభ సభ్యులు అతని ని హతమార్చడానికి పాల్పడ్డారు.
వివరాలలోకి వెళ్తే:-
కొండ. సీతా రామిరెడ్డి కి ఇద్దరు కుమారులు కొండ.శ్రీనివాసరెడ్డి, కొండ. కృష్ణ రెడ్డి రెండో కుమారుడు శ్రీనివాసరెడ్డి కులాంతర ( ముదిరాజులు ఆమెను ) వివాహం చేసుకోవటం తో అది కుటుంబ సభ్యులకు ఇష్టం లేక ఆస్తి ఎక్కడ పంచి ఇవ్వవలసివస్తుందో అని అతనిని నిన్న ఇంటికి పీలించి గొడ్డలి తో తండ్రి సీత రామిరెడ్డి, తల్లి సామ్రాజ్యం తమ్ముడు కృష్ణరెడ్డి అతని భార్య భాగ్యలక్ష్మి లు కలసి హత్యచేయుటకు పునుకొని గొడ్డలి తో బాధితుని ని 7 చోట్ల నరికి వెళ్లారు. అడ్డువెళ్లిన అతని భార్య శివకుమారి ని కూడా గొడ్డలి తో చేతిమీద విచక్షణ రహితంగా డాడీ చేసారు. రక్తశ్రావo తో పడిఉండటం గమనించిన అతని బంధువులు క్షతగాతృళ్లను హుటా హుటిన ఓ ప్రైవేట్ వాహనం లో నరసరావుపేట లోని ఓ ఆసుపత్రి కి తరలించి చికిత్సచేస్తున్నారు అతనికి ఎటువంటి ప్రాణహాని లేదని అతని భార్య తెలిపారు.
గొడ్డలి తో హత్య యత్నం చేసారని స్థానిక నకేరికల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టి పట్టనట్టు వ్యవహరిష్టించినట్లు ఆరోపణలు లేకపోలేదు. హత్య యత్నం కింద సెక్షన్ 307 కింద కేసునమోదు చేయాలి. కానీ SI సురేష్ కేసును తారుమారు చేసి సెక్షన్ 304 కి మార్చి మార్చినట్లు బాధితుడి భార్య ఆరోపిస్తున్నట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది