తూర్పు జిల్లా : నల్లజర్ల :తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన నకిలీ సివిల్ సప్లై అధికారిణి కాళ్ళ రమాదేవి అనే మహిళ మరో ఇద్దరు యువకులు కలిసి నల్లజర్ల మండలం దుబచర్ల గ్రామంలో హోటల్స్ , బేకరీ వద్దకు వెళ్లి మేము CS DT , డిప్యూటీ తహసిల్దారు అంటూ..ఇక్కడ అంతా అపరిశుభ్రంగా ఉంది అంటూ హోటల్ యజమానులను బెదిరించి 10 వేల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన నకిలీ CS DT..హోటల్స్ మరియు బేకరీ సిబ్బంది నగదును నకిలీ అధికారుణికి ఇస్తున్న సమయంలో… వీరి కదలికలపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా..నకిలీ అధికారిని కాళ్ల రమాదేవి ఆమెతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు..
సీఐ లక్ష్మణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
వీరు నకిలీ అధికారులని ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఇలాంటి వారిని చూసి ప్రజలు మోసపోవద్దని అలాగే ఇలాంటి వ్యక్తుల మీద ఏదైనా అనుమానం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించిన సిఐ లక్ష్మణ్ రెడ్డి..