- ఆంధ్రోళ్ళకు తెలంగాణ లో నందులేంది ?
- తెలంగాణ బిడ్డల ఆర్తనాధాలు వినపడడం లేదా ప్రభుత్వానికి ?
- ఆంధ్రా సినీ కార్మిక సంఘాల మోసాలు, దందాలు
- తెలంగాణ కాదు ఆంధ్రా సినిమాటోగ్రఫీ మంత్రి అని పిలవాలా ?
హైదరాబాద్ : ఆంధ్రోళ్లకు నంది అవార్డులు ఏందంటూ మండిపడ్డారు సీనియర్ జర్నలిస్ట్, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్.
తెలంగాణ నేలను ఆంధ్రా పాలకులు ఆక్రమించారని, తెలంగాణ నిధులు, నీళ్లు, భూములను ఆంధ్రా పెత్తందారులు స్వాధీనపరచుకున్నారని, తెలంగాణ ప్రజలను దిగువస్థాయికి అణగదొక్కారని, తెలంగాణ భాషను వెక్కిరించారని, ఉద్యోగాలు కొల్లగొట్టారని, పదవులు ఆంధ్రావాళ్ళే అనుభవించారని, తెలంగాణను 60 ఏండ్లు ఆగం చేసారని కన్నెర్ర చేసింది తెలంగాణ గడ్డ.
వందలాది మంది తెలంగాణ యువత తమ నెత్తురు ధారపోసి ఆంధ్రా పాలకుల గుండెల్లో వణుకు పుట్టించింది. సుమారు 12 వందల మంది బలిదానం వలన తెలంగాణ ఆవిర్భవించింది. నీళ్ళు, నియామకాలు, నిధులు అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో యువత కలలు కట్టుకున్న ప్రపంచంలో శూన్యుమే మిగిలిందన్నారు సుధాకర్.
ఆంధ్రా పెత్తందారుల చేతిలో నేటికీ తెలంగాణ సినీ కార్మికులు నలిగిపోతున్నారు. అడుగడుగునా అణచివేయబడుతున్నారు. నేటి కి విభజన చట్టం అమలు కాలేదు. తెలంగాణ సినీ కార్మిక సంఘాలు చెల్లవు, ఫెడరేషన్ ఫేక్ , ఛాంబర్ లేదు. తెలంగాణ కార్మిక సంఘాలలో ఉంటె కడుపు పై కొడతారు. తెలంగాణాలో ఉన్న ఆంధ్రా సినీ కార్మిక సంఘాలు తెలంగాణ సినీ కార్మిక సంఘాలు చెల్లవంటూ ప్రచారాలు చేస్తున్నారు. ఆంధ్రా సినీ కార్మిక సంఘాల ఆగడాలకు అంతులేదు. కలెక్షన్లు, మోసాలు, దందాలు పట్టించుకునే అధికారి గాని, నాయకులు గాని లేరు. గత ప్రభుత్వం తెలంగాణ సినీ కార్మికుల సమస్యల పై పట్టనట్టు వ్యవహరించింది. కనీసం సియం రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డల సమస్యల పై స్పందిస్తారని ఆశించారు. కానీ ఆంధ్రా సినీ పెత్తందారులకు ఆహ్వానాలు, అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ తెలంగాణ సినీ కార్మికుల సమస్యల పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటప్పుడు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి ఎందుకు ? ఆంధ్రా సినిమాటోగ్రఫీ మంత్రి అని పెట్టుకుంటే సరిపోలే ? తెలంగాణ మంత్రుల తీరునుబట్టే ఆంధ్రా పెత్తందారులు తెలంగాణ సినీ మరియు టివి కార్మికులను అణచివేస్తున్నారని సుధాకర్ మండిపడ్డారు.
తెలంగాణ భాషను వెక్కిరిస్తారు, యాసను వెక్కిరిస్తారు. తెలంగాణ స్లాంగ్ ఉన్న క్యారెక్టర్ కి ఆంద్రోళ్ళ చేత డబ్బింగ్ చెప్పిస్తారు. అంటే అణచివేత ఎక్కడుంది ? మనకి కనబడేది ఒకటి చేస్తున్నది మరొకటి ఎవరు గమనించాలి ? ఎవరు తెలంగాణ బిడ్డల ఆర్తనాధాలు వినేది ! పని చేయించుకుని కార్మికుల వేతనాలు ఇవ్వరు. శ్రమ దోపిడీ చేస్తున్నారు. అడిగితె రౌడీ షీటర్స్ తో బెదిరింపులు లేదా అక్రమ కేసులు పెట్టి పోలీసుల చేత మానసిక వేదనకు గురిచేస్తున్నారు. అంటే డబ్బుతో పోలీసులను, రౌడీ షీటర్స్ ను కొంటున్నారా ? లేక ఏంటి ? సుమారుగా 40 ఏళ్ళు ఆంధ్రా సినీ పెత్తందారుల చేతిలో తెలంగాణ బిడ్డలు అడుగడుగునా అణచివేయబడుతున్నారు.
తెలంగాణ బిడ్డలను అణచివేస్తున్న ఆంద్రోళ్ళకు తెలంగాణాలో నంది అవార్డుల ప్రదానం ఏందీ ? తెలంగాణ బిడ్డలను ఆగం చేసిన వాళ్లకు తెలంగాణాలో నంది అవార్డులు ప్రదానం చేస్తారా ? సియం రేవంత్ రెడ్డి నంది అవార్డుల ప్రదానం విషయంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే తెలంగాణ బిడ్డలను అవమానించినట్టే.
ముందుగా తెలంగాణ సినీ మరియు టీవీ పరిశ్రమను ఏర్పాటు చేసే విషయంలో సమగ్రమైన కార్యాచరణ చేపట్టి, శాఖను పటిష్టం చేసి ఆ తరువాత తెలంగాణ పెద్దల సమక్షంలో నంది అవార్డుల ప్రదానం గురించి మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణ సినీ మరియు టివి కార్మికులకు న్యాయం చేసే ఏ కార్యక్రమంలో అయినా ప్రభుత్వానికి సహకరిస్తాం. అదే సమయంలో అన్యాయం జరిగిన ప్రతిచోటా పేద సినీ మరియు టివి కార్మికుల గొంతుకగా నిలబడి రాజీలేని పోరాటం చేయడానికి వెనుకాడబోనని వి.సుధాకర్ తెలిపారు.
నటుడు మురళీమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్మాణ సమస్థ వీబీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదులో నిర్వహించిన వేడుకకి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హాజరయ్యారు. నటుడు మురళీమోహన్ నంది అవార్డుల విషయం ప్రస్తావించిన విషయం తెలిసిందే.