చంద్రగిరి మండలం, ఏ రంగంపేట సమీపంలోని ఎం.బి.యు వ్యవస్థాపకులు, ప్రముఖ సినిమా హీరో మంచు మోహన్ బాబుని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. మోహన్ బాబు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే నాని విద్యానికేతన్ లోని మోహన్ బాబు నివాసంలో కలిశారు. మోహన్ బాబు ఎమ్మెల్యే నానికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొంత సమయం పిచ్చపాటి మాట్లాడుకున్నారు. ఇరువురు కలిసి అల్పాహారం స్వీకరించారు. ఎన్నో ఆటుపోట్లకు తట్టుకొని ఎమ్మెల్యేగా గెలవడం ఎంతో సంతోషకరమని మోహన్ బాబు అన్నారు. చంద్రగిరి అభివృద్ధికి సహకార అందించాలని ఎమ్మెల్యే నాని మోహన్ బాబు కోరారు. సామాజిక సేవలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని చంద్రగిరి అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మోహన్ బాబు ఎమ్మెల్యే నానికి తెలిపారు.