- వానలు వచ్చిన వరదలు వచ్చిన లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేయాల్సిందే
- జోరు వానలో ఆగని పించన్ పంపిణీలు
- సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు
తిరుపతి చంద్రగిరి : గత ప్రభుత్వంలో ఒకటవ తేదీకి రావలసిన పింఛను ఎనిమిదో తారీకు ఆరో తారీకు వచ్చేది. కానీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పుడు ఒకరోజు ముందుగానే ఫించన్ అందిస్తున్నారు. దీనికి మేము వారికి లభిదారులు కృజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. డిసెంబర్ 1వ తేదీన ఇవ్వవలసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ ను ఒకరోజు ముందుగానే అవ్వ, తాతలకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా పాకాల మండలం పాకాల పంచాయతీ గాంధీనగర్ లో కూటమి పార్టీ మండల నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన ఆదివారం కావడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రభుత్వం ముందు రోజు నవంబర్ 30వ తేదీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ 100% పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. పెంచిన పెన్షన్ ను లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. పెన్షన్ దారులు ఇంటి వద్దనే ఉండి పెన్షన్ తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజల కష్టాలను, సమస్యలు తెలిసినవారు కాబట్టే మా పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజు ముందు పెన్షన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.