తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని శాసన సభ్యులు పులివర్తి నాని అన్నారు. ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల 17 వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. కళాశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయిస్తానని, పాకాలలో మహిళా హాస్టల్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థులు లక్ష్యసాధనకోసం పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పక విజయం లభిస్తుందన్నారు. విద్యారంగం అభ్యున్నతి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని విద్యార్థులు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానాచార్యులు డా.ఎ . మొహిద్దీన్ బాషా, డా. దామోదర్ నాయుడు, ప్రధానాచార్యులు డా॥ ఎస్.వి. రమేశ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ మాసులామణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
