పిడుగురాళ్ల: ఇటీవల హత్య గావించబడిన బీసీ నాయకుడు కంచేటి జల్లయ్య గారి కుటుంబాన్ని పరామర్శించడానికి పిడుగురాళ్ల మీదుగా కారంపూడి మీదుగా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం, రావులాపురం గ్రామానికి విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి ఘన స్వాగతం పలకాలని గురజాల నియోజవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చిన గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారు.
ఇటీవల కాలంలో మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గట్టి కార్యకర్త కంచేటి జల్లయ్య యాదవ్ ని వైసిపి గుండాలు దారుణంగా హత్య చేశారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు రేపు అనగా 23-06-2022 ఉదయం 11 గంటలకి పిడుగురాళ్ల మీదుగా కారంపూడి మీదుగా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అదేవిధంగా జల్లయ్య పెద్దకర్మ కార్యక్రమం లో పాల్గొనడానికి వెళ్తున్నారు.
కాబట్టి గురజాల నియోజకవర్గం లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా వేలాదిగా ఉదయం 10 గంటలకల్లా పిడుగురాళ్ల పట్టణానికి వచ్చి నారా లోకేష్ గారికి అఖండమైన స్వాగతం పలికి, బీసీ నాయకుల హత్యాకాండని నిరసిస్తూ, ఖండిస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల హత్యాకాండను ఖండిస్తూ అందరూ కూడా నారా లోకేష్ గారి పరామర్శ యాత్రకు సంఘీభావంగా వేలాది మంది తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యవలసిందిగా పల్నాడులోని పసుపు సైనికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తావున్నాను.