టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే, తన మామయ్య నందమూరి బాలకృష్ణ తాజా చిత్రానికి వీర సింహారెడ్డి అనే పేరు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలకృష్ణ సినిమాలను చిరంజీవి సినిమాలతో పోలుస్తూ కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో గడచిన 2, 3 రోజులుగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా బాలకృష్ణ సినిమాలు అణగారిన వర్గాలను కించపరిచేవిలా ఉన్నాయంటూ టీడీపీకి చెందినదిగా భావిస్తున్న ఓ ట్విట్టర్ ఖాతా మీద ఓ ట్వీట్ పోస్టు అయ్యింది. దీనిని చూసిన లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ట్వీట్ ను పోస్ట్ చేస్తూ ఈ పోస్ట్ ఫేక్ అంటూ లోకేశ్ ప్రకటించారు.
అంతటితో ఆగని లోకేశ్…ఈ ఫేక్ ట్వీట్లు చేసే లక్షణం వైసీపీదేనని ఆరోపించారు. అదే ఆరోపణతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ”ప్యాలస్ పిల్లి చీప్ ట్రిక్స్! కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఐప్యాక్ గ్యాంగ్స్, పేటిఎం డాగ్స్ రంగంలోకి దిగాయి తస్మాత్ జాగ్రత్త! కులం, మతం పేరు చెప్పి రాజకీయం చేసే వారిని చెప్పుతో కొట్టండి. ఫేక్ అకౌంట్స్, ఫేక్ ట్వీట్స్ నీకు ఆత్మ సంతృప్తిని ఇస్తాయేమో గానీ నిన్ను ఓటమి నుండి తప్పించలేవు జగన్ రెడ్డి” అంటూ లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్యాలస్ పిల్లి చీప్ ట్రిక్స్..! కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఐప్యాక్ గ్యాంగ్స్, పేటిఎం డాగ్స్ రంగంలోకి దిగాయి తస్మాత్ జాగ్రత్త! కులం, మతం పేరు చెప్పి రాజకీయం చేసే వారిని చెప్పుతో కొట్టండి.(1/2) pic.twitter.com/w4TwNZuj7D
— Lokesh Nara (@naralokesh) October 25, 2022