- ఏ బజారులో చూసిన రోగాలతో స్వాగతం
- కాని తగ్గని గవర్నమెంట్ బాదుడు బిల్లులు
- ఎన్ని సార్లు కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోని అధికారులు
పల్నాడు జిల్లా కారంపూడి మండలం నరమాలపాడు గ్రామం అభివృద్ధి పరుగులు తీస్తోంది. ఎటు చూసిన మురుగు గుంతలు, మురుగు నీరు, దోమలతో నిండి గ్రామ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. గ్రామస్తులు ఎన్నో సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపణలు లేకపోలేదు. మురుగు నీటి వలన దోమలు పెరిగి దోమకాటుకు గురయి అనారోగ్య బారిన పడుతున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు గాని ఇటు అధికారులు గాని పట్టనట్టు వ్యవహరించడం గమనించదగ్గ విషయమే. ఆ గ్రామానికి త్రాగునీరు గాని, రవాణా మార్గం గాని ఇప్పటికి లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.