నరసారావు పేట : భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి ఈ రోజు నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
డాక్టర్ శ్రీగోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆజాద్ అమూల్యమైన సేవలను కొనియాడుతూ మాట్లాడుతూ, ‘‘మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ తో కీలక పాత్ర వహించారు. ఆయన భారతదేశ విద్యా వ్యవస్థకు ప్రతిష్టాత్మకమైన పునాదులు వేశారు. జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు’’ అని అన్నారు.
‘‘అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఐఐటి, యూనివర్సిటీలు ఏర్పాటు చేసి, దేశ విద్యా విధానానికి కొత్త దిశలు చూపించారు. యూజీసీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు నేరుగా యూనివర్సిటీలకు అందించటం కూడా ఆయనకు చెందిన ప్రధాన నిర్ణయాలే’’ అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ ఖాదర్బాషా, పొదిలే ఖాజా, మాజీ కౌన్సిలర్ జిలాని, SD జాఫర్, షేక్ మహబూబ్ బాషా, షేక్ జిలాని బాబా, పఠాన్ సుభాని, సయ్యద్ కరిముల్లా, అబ్దుల్ రజాక్, పంగులూరు విజయకుమార్, షేక్ సిలార్ భాష, సయ్యద్ బాషా, మిట్ట చిరంజీవి, ఎంఎన్ రెడ్డి తదితరులు పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాల్గొన్నారు.