రుద్ర స్టూడియో ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో శ్రీనగర్ కాలనీలోని సత్య సాయి నిగమంలో తేదీ: 23 /04 /2023 ఆదివారం రోజున సామాజిక కార్యకర్త అవార్డు అందుకున్న నరేష్ మోతే ( నమో) ఈ సందర్భంగా మాట్లాడుతూ రుద్ర స్టూడియో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవార్డు ఇచ్చి నాకు బాధ్యత పెంచారని నేను అనుకుంటున్నాను అందరికీ విద్య ,వైద్యం ఉచితంగా అందించాలని మరియు ప్రతి మండలానికి ఇంటర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ , ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలని గల్లీ టు టు ఢిల్లీ వరకు ఒకసారి పాదయాత్ర చేశాను, ఒకసారి బైక్ యాత్ర చేయడం జరిగింది. నేను చేసే అటువంటి కార్యక్రమాలు రుద్ర శ్రీనివాస్ అనే వ్యక్తి నా స్టేటస్ చూస్తారు, మరియు ఫేస్బుక్లో ఫాలో అవుతారు. మీరు చేసే అటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. మీరు ముందు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తారని వారు అనడం జరిగింది. ఈ అవార్డు ఇచ్చినటువంటి రుద్ర శ్రీనివాస్ గారికి మరియు వారి టీం కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
