- ప్రశ్నించే గొంతుకను అణిచివేసే ప్రయత్నం :
- క్యూ న్యూస్ పై దాడిని ఖండించిన బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నాతరి స్వామి…
తెలంగాణ లో ప్రశ్నించే గొంతుకను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు అని
బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నాతరి స్వామి అన్నారు. క్యూ న్యూస్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్యూ న్యూస్ సంస్థ పై వారి సిబ్బంది పై జరిగిన దాడి హేయమైన చర్య అని తెలిపారు. ఉన్నది ఉన్నట్టు… విన్నది వినట్టు ప్రజల పక్షాన ఉంటూ వారి కోసం పోరాడుతున్న మల్లన్న ను నేరుగా ఎదుర్కొనే శక్తి లేకనే ఇలాంటి కొందరు ఈ వికృత చేష్టాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అధికార పార్టీ కి చెందిన నాయకులే ఈ దాడిని చేయించి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.