contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రామాయంపేటలో క్రీడోత్సవాలు

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో భారత హాకీ లెజెండ్ ధ్యాన్చంద్ జయంతి పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ధ్యాన్చంద్ జయంతిని, క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నట్లు యువజ్యోతి ఫుట్బాల్ అకాడమీ నిర్వాహకులు బొంతల సత్యనారాయణ తెలిపారు. హాకీ ప్రభుత్వ హైస్కూల్ మరియు యువజ్యోతి జట్ల మధ్య హాకీ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పోటీలను స్థానిక ఎస్సై రంజిత్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడాకారుడు ధ్యాన్చంద్ అడుగుజాడల్లో ప్రతి క్రీడాకారుడు నడుచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో యువజ్యోతి బొంతల సత్యనారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం లెక్చరర్ లు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :