జగన్ మోహన్ రెడ్డి బొమ్మ ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్ కాపీలను ప్రజలంతా వీధుల్లోకి వచ్చి తగులబెట్టాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్వహించిన ప్రజాగళంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని ప్రజలకు హామీనిచ్చారు. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని ఆయన నిలదీశారు. ఎన్డీఏ ఆధ్వర్యంలోని కూటమి అధికారంలోకి రాగానే రాజముద్రతో వాటిని పునర్ముద్రిస్తామని చంద్రబాబు తెలిపారు. సోమవారం జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.