తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అదే సమయంలో రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని టీడీపీ అధినేతను కోరారు. విభజన హామీలు, ఆస్తుల పంపకాలపై పూర్తిగా చర్చించుకొని… సామరస్యంగా పరిష్కరించుకుందామని సూచించారు.