ఆంధ్రప్రదేశ్ లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇసుక అందుబాటులోకి తీసుకొస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రజలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక అందిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇసుక పంచాయితీ మొదలైయ్యింది.
ఉచిత ఇసుక విధానంపై అనేక ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమంది మంత్రులపై మండిపడ్డారని తెలిసింది. అమరావతిలో బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులకు క్లాస్ పీకారని తెలిసింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానం పై ఏం జరుగుతోంది అంటూ కొంతమంది మంత్రులను ప్రశ్నించారని తెలిసింది.
ఉచిత ఇసుక విధానంపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ ఫిర్యాదుల్లో అధికార పార్టీ నాయకులపైన ఆరోపణలు ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి చెప్పారని తెలిసింది. ఉచిత ఇసుక విధానం అమలు చేసే విషయంలో మీరు ఏం చేస్తున్నారని, ఎమ్మెల్యేలతో మీరు ఎందుకు చర్చలు జరపలేదని, ఇంత జరుగుతున్నా మీరు నా వరకు ఎందుకు తీసుకురాలేదని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.
వారం రోజుల్లో మార్పు రాకపోతే నాలోనే మార్పులు వస్తాయని, ఎవరనీ ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. జగన్ ప్రభుత్వంలో బ్లాక్ మార్కెట్ లో ఇసుకను విక్రయించారని, ఆ సమయంలో ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారని, ఆ విషయం మీరు మరిచిపోయారా అంటూ సీఎం చంద్రబాబు మంత్రులను ప్రశ్నించారని తెలిసింది.
ఉచిత ఇసుక విధానం పై మీరు పద్దతి మార్పుకోకపోతే పరిస్థితి వేరుగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు కొందరు మంత్రులను హెచ్చరించారని తెలిసింది.
ఎవరైనా ఇసుకను సొంతంగా తవ్వుకొని వెళ్తుంటే వాళ్ల దగ్గర ఎలాంటి రుసుము వసూలు చెయ్యకూడదని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. కొందరు అధికారులు ఆంక్షాల పేరుతో వేధిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. ఇసుక కొరత రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ అధికారులకు మీరే ఆదేశాలు జారీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు సూచించారని తెలిసింది.