contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జగన్ భూ దందా పై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం – Live

వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి లెక్కలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  బయటపెడుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు (సోమవారం) ఏపీ సచివాలయంలో శ్వేతపత్రాలను సీఎం విడుదల చేశారు. తాజాగా సహజ వనరులైన భూములు, గనులు, అటవీ సంపదపై విడుదల చేశారు. స్వయంగా సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత ప్రభుత్వం అవినీతి ద్వారా సహజ వనరులు ఎలా దోచుకుంది..? పర్యవరణానికి ఎలాంటి ఇబ్బందులు గురించేసింది..? అనే విషయాలను పూసగుచ్చినట్లుగా వివరిస్తున్నారు.

గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం సహజవనరులు దోపిడీ చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం అడవులను కూడా ధ్వంసం చేసిందని ఆరోపించారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపద దోపిడీ జరిగిందని, వైసీపీ ప్రభుత్వం కొత్త విధానంతో దోపిడీ జరిగిందని విమర్శలు చేశారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూకబ్జాలు చేశారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ నేతలు దందాలకు దిగారని సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు.

పంచభూతాలను దోపిడీ చేశారు…

‘‘అవినీతి ద్వారా సహజవనరులు ఎలా దోచుకుంటారు, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు తెస్తారో చూశాం. గత ప్రభుత్వంలో పంచభూతాలను దోపిడి చేశారు. భూములు లిటిగేషన్ తెచ్చి కొట్టేయడం. గతంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసును సైతం ఏర్పాటు చేసి అడవులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. అయితే ఇప్పుడు అడవులను కూడా వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. ఇప్పుడు నేను చెప్పే రికార్డులు ఒకవంతు అయితే వాస్తవానికి మూడు, నాలుగు రెట్లు విధ్వంసం జరిగింది. పట్టణప్రాంతాల్లో ఉన్న భూములు అంటే ఉదాహరణకు కావాలి, నెల్లూరు, ధర్మవరంలో కూడా మార్నింగ్ వాక్ పేరుతో దోచేశారు. హౌస్ సైట్స్ పేరుతో ఈ దందాను నడిపించారు. ప్రజాస్వామ్యానికి గంతలు కట్టి ఆఫీసులు పేరుతో కట్టేశారు. చివరకు ల్యాండ్‌ను ఎవ్వరిని అడకుండా దోచేసేందుకు ఓ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తెచ్చారు’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

రామానాయుడు స్డూడియోపై కన్ను..

‘‘విశాఖపట్నంలో ఇచ్చిన రామానాయుడు స్డూడియోను రెసిడెన్సియల్ అని చూపించి కొట్టేయాలని చూశారు. చివరకు సుప్రీకోర్టుకు వెళ్లారు. హయగ్రీవ భూములు అప్పటి స్ధానిక ఎంపీ, శారదాపీఠం, షాహీ హియరింగ్ కాలనీల పేరుతో కొట్టేయాలని చూశారు. దస్పల్లా భూములు బలవంతంగా ట్విస్ట్ చేసి అక్కడ భూములు కొట్టేసి నిర్మాణాలు చేశారు. ఎంవీవీ, ఎంవీకే హౌసింగ్ పరుతో అసంబద్ధమైన ఒప్పందాలు చేసుకొని కొట్టేశారు. ఒంగోలులో ఎన్నో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తే 77 మందిపై కేసులు పెట్టారు. ఇది విచారణలో ఉంది. చివరకు తిరుపతిలో సెటిల్మెంట్ ల్యాండ్‌లు, మఠం భూములను 22ఏ ఉపయోగించి కొట్టేశారు’’ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

పుంగనూరులో 982ఎకరాల దోపిడీ..

‘‘ఎవ్వరి భూమి అయినా 22ఏ పెట్టి వీరు రిజిష్ట్రేషన్ చేయించుకొని మార్చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో 982ఎకరాలు పుంగనూరులో అరాచకంగా ఇచ్చేశారు. రైత్వారీ పట్టాలు ఇచ్చి ఇచ్చేశారు. 10వేల ఎకరాలు ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ భూములు అసెన్డ్ ల్యాండ్ పేరుతో ఆక్రమించారు. హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వైసీపీ నేతలే డిసైడ్ చేస్తారు. వాటికి ఎక్కువ రేటు పెట్టి కొట్టేశారు. ఆవభూములు, ఊరుకు దూరంగా ఉన్న భూములు, పొలాలకు వెళ్లే భూములు, శ్మశానాలు కూడా ఇళ్లనిర్మాణానికి ఇచ్చారు. 361 ఎకరాలు 161 కోట్ల రూపాయలుకు ఇచ్చారు. నివాసయోగ్యం కాని భూములు ఇచ్చారు. 286ఎకరాలను రూ.185కోట్లుకు కొనుగోలు చేశారు. గన్నవరంలో కూడా మార్కెట్ రేట్ల కంటే 5 రెట్లు ఎక్కవ ఇచ్చి దోచేశారు’’ అని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మైనింగ్ విషయంలో శ్వేతపత్రం

‘‘ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనే ఓ చట్టాన్ని తెస్తున్నాం. ఇందులో నిరూపించుకోవవాల్సిన బాధ్యత గ్రాబర్‌కు ఉంటుంది. గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2020 లైన్స్ లోనే ఈ చట్టం తెస్తాం. మైనింగ్ విషయంలో భారీగా పెనాల్టీ వేసి ఇబ్బందులు పెట్టారు. ఒక్క మైనింగ్ విషయంలోనే రూ.20వేల కోట్లు దోపిడీ చేసి ఉండొచ్చు అయితే అంతకు మించి అవినీతి చేసి ఉంటారు. ఇసుక మైనింగ్‌లో రూ.7వేల కోట్లు, డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నారు.ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి కేసును ఆగస్టు నెలకు వాయిదా వేసింది. టార్గెట్ చేసి ఫైన్లు వేయడం, నిబందనలు పాటించకుండా మైనింగ్‌లో దోపిడీ చేశారు. 2016లో ఉచిత ఇసుక ఉండేది నిర్మాణ రంగానికి బూస్టు ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక నియంత్రణ చేసి 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉద్యోగాలు లేకుండా చేశారు. 130మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :