ఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ ఉదయం కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో వీరు భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ. 12 వేల కోట్లు కేటాయించింది. ఈ నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో వీరు చర్చించారు. పోలవరం కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సాయంపై కూడా చర్చ జరిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరవుతారు. సీఎంగా రేఖా గుప్తా, మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్డీయేకు చెందిన కీలక నేతలు హాజరవుతారు.
మధ్యాహ్నం 3 గంటలకు అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవుతారు. సాయంత్రం 4.45 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 5.55 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ లోని తన నివాసానికి చంద్రబాబు బయల్దేరుతారు.