నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో సీబీఐ అధికారులు ముందడుగు వేశారు. బీహార్ కేంద్రంగా నీట్ పేపర్ లీక్‌కు పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని గురువారం అరెస్టు చేశారు. పాట్నాకు చెందిన మనీష్ కుమార్, అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.
రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. లీకేజీకి ప్రధాన కేంద్రాలుగా అనుమానిస్తున్న బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. అయితే మనీష్ కుమార్ నీట్ పేపర్‌ను 12 మంది విద్యార్థులు, అంతకంటే ఎక్కువ మందికి ఇచ్చాడని సీబీఐ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరో నిందితుడు అశుతోష్.. లీకైన నీట్ పేపర్ చదువుకునేందుకు వీలుగా తన ఇంటిని, నిరూపయోగంగా ఉన్న ఓ స్కూల్‌ను వాడుకున్నట్లు సీబీఐ గుర్తించింది.