- నీట్ పరీక్ష పేపర్ లీకేజీలో భాగం అయినటువంటి ఎన్ టి ఏ ఏజెన్సీని రద్దు చేయాలి
- ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత బందును అక్రమంగా అడ్డుకున్న పోలీసులు
- AISF, SFI విద్యార్థి సంఘాల డిమాండ్
ఐక్య విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా AISF, SFI విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మదనపల్లిలో బందును నిర్వహించడం జరిగింది. సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మాధవ్, ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష లీకేజీలో భాగమైనటువంటి NTA సంస్థను రద్దు చేయాలని అలాగే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నీటి పరీక్ష లీకేజీ పై సమగ్ర విచారణ జరిపించాలనీ ఐక్య విద్యార్థి సంఘాల జాతీయ సమితి పిలుపు మేరకు స్థానిక మదనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బందుకు సహకరించాయి అని అన్నారు. తదనంతరం బందు నిర్వాహణకు వెళ్తున్న ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అక్రమంగా అడ్డుకొని కేసులు పెడతామని బెదిరిస్తూ విద్యార్థి సంఘాల నాయకులను బెదిరింపులు గురి చేశారు అయినా కూడా పట్టు వదలకుండా కళాశాలలో పాఠశాలలో బంధు నిర్వహణలో పాల్గొని బంధువులు జయప్రదం చేయాలని కళాశాలలు పాఠశాలలు తిరుగుతూ ఉన్నటువంటి వైనంలో పోలీసులు తమ అక్రమ ఆగడాలను విద్యార్థి సంఘాల నాయకుల పైన చూపించడం జూలు విధలించడం చాలా బాధాకరమైన విషమని ఆయన దుయపట్టారు అదేవిధంగా నీట్ పరీక్ష లికేజ్ కి పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకొని పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు న్యాయం చేయాలని అని వారు అన్నారు . అదేవిధంగా నీట్ పరీక్ష వల్ల నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని, నీట్ పరీక్ష విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అర్హతలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నీటి పరీక్షను నిర్వహించాలని ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఐక్య విద్యార్థి సంఘాలు బందును 8 డిమాండ్లతో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు
డిమాండ్లు:
1. ఎన్ టి ఏ వ్యవస్థను రద్దు చేయాలి.
2. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి.
3. ఇటీవల నెట్ నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి.
4. పీహెచ్డీ అడ్మిషన్లు కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి.
5. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలి .
6. ముంబై ఐఐటి నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘ నేతలపై అక్రమ కేసులు నిర్బంధాలను యూనివర్సిటీలో ప్రజాస్వామ్యాన్ని అణిచివేత చర్యలు ఆపాలి.
7. దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేతను ఆపాలి.
8. నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలి.
పై డిమాండ్లతో శాంతియుత బందును నిర్వహిస్తున్న సందర్భంగా మదనపల్లి లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ విద్యార్థి సంఘ నేతలను అడ్డుకోవడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా నీట్ పరీక్ష లీకులపై సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించి కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున అన్ని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పార్లిమెంట్ ను ముట్టడిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కోశాధికారి వినయ్ మదనపల్లి నియోజకవర్గ సహాయ కార్యదర్శి కమలాకర్ , ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు విష్ణు ఉదయ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.