contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మహిళ పై అత్యాచారయత్నం .. తూ తూ మంత్రంగా పోలీస్ కేస్

  • నెల్లూరు జిల్లా …బుచ్చిరెడ్డి పాలెం లో దుశ్యాసనపర్వం
  • అత్యాచారం నుండి తప్పించుకునే క్రమం లో వంటి మీద నూలు పోగు లేకుండా ప్రాణాలు అరచేతి లో పెట్టుకుని రోడ్డు మీదకు పరుగులు తీసిన మహిళ…
  • మహిళ పై అత్యాచార యత్నం చేసి,చిత్ర హింసలకు గురి చేసిన కళ్యాణ్ అనే యువకుడు
  • లొంగక పోవడం తో రెండు గంటల పాటు చిత్రహింసలు, మొహమంతా పిడిగుద్దులు,చెక్క తో కొట్టి వళ్ళంతా గాయాలు
  • నాలుగు రోజుల తర్వాత (31-7-2024) దిశ మహిళా సంఘాల చొరవతో నెల్లూరు లోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న మహిళ
  • చెవి లో కర్ణ భేరి దెబ్బ తిన్నదని తేల్చిన వైద్యులు
  • ఘటన జరిగిన రోజే బుచ్చి పోలీసు స్టేషన్ లో పిర్యాదు ఇచ్చిన బాధిత మహిళ
  • తూతూ మంత్రంగా కేసు నమోదు, నిందితుడు దర్జాగా బయట తిరుగుతూ బెదిరింపులు
  • మహిళ గాయాలతో,అవమాన భారంతో న్యాయం కోసం పోలీసు స్టేషన్ కు వెళితే మొదట ఆసుపత్రికి పంపి చికిత్స అందేలా చేయాల్సిన పోలీసులు బాధ్యత మరిచిన వైనం
  •  ఒంటరి మహిళ వ్యక్తిగత విషయాలు ఎత్తి చూపుతో పై అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్న బుచ్చి పోలీసులుకు
  • అంత పెద్ద నేరం చేసిన తర్వాత కూడా నిందితుడు స్వేచ్చ గా కాలర్ ఎగరేస్తూ బయట తిరుగుతుండడం తో పలు అనుమానాలకు, పుకార్లకు తావిస్తున్న బుచ్చి పోలీసులు

 

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం లో శనివారం (27-7-2024) నాడు దారుణ ఘటన చోటుచేసుకుంది, బుచ్చిరెడ్డిపాలెం రాఘవరెడ్డి కాలనీలో ఒక మహిళ ఒంటరిగా నివసిస్తుంది,ఈ ఒంటరి మహిళ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది,ఇదే క్రమంలో తన ఇంటి సమీపంలో నివసించే కళ్యాణ్ అనే యువకుడు శనివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతం లో ఆటోలో వచ్చి మహిళను బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని సమీపంలో తన బందువులకు సంబంధించిన కొయ్యల మిల్లు దగ్గర కి లాక్కెళ్లి అక్కడ అత్యాచారానికి ప్రయత్నించగా మహిళ లొంగకపోవడంతో పక్కనే ఉన్న రూమ్ లోకి తీసుకెళ్లి పిడుగులతో మొహమంతా గాయపరిచి పక్కనే ఉన్న చెక్క దిమ్మెతో ఒళ్లంతా కొట్టాడని సుమారు మూడు గంటల సేపు రూం లో చిత్ర హింసలకు గురిచేసాడని నేను బయట పోతే నిజం చెప్తానని నిన్ను చంపేస్తా అంటూ కాలుతో తీవ్రంగా తంతూ తలమీద కొట్టడం తో దెబ్బలు, నొప్పి భరించలేక నన్ను వదిలేయాలని కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా మొహంమ్మీద గుద్దాడని వంటిమీద నూలుపోగు లేకుండా చించి వేసాడని ఎలాగోలా తప్పించుకుని ఒంటిమీద నూలు పోగు లేకుండానే నిందితుడు కళ్యాణ్ నుండి తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు మీదకి రాగా చుట్టుపక్కల వారు బట్టలు కప్పి ఆమెను కాపాడినట్టు, ఈ ఘటనపై అదేరోజు శనివారం (27.7.2024) ఫిర్యాదు చేసినట్టు బాధిత మహిళ తెలిపారు…నిరక్షరాస్యులైన బాధిత మహిళ అంత క్షోభ అనుభవించి తనకు జరిగిన అన్యాయం పై పోలీసులకు పిర్యాదు చేస్తే వెంటనే బాధిత మహిళను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించి అనంతరం విచారణ చేసి నిందితుడి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి అటువంటి కార్యక్రమం చేయకపోగా అంత నేరం చేసిన నేరస్తుడు కాలర్ ఎగరేసుకుంటూ బాధిత మహిళను భయపెట్టే విధంగా చుట్టుపక్కల తిరుగుతుండడం తో బుచ్చి పోలీసులపై అనేక అనుమానాలు రేకెత్తాయి.. మహిళ ఒంటరిగా ఉండడం ఆమె వ్యక్తిగత జీవితం సరిగా లేదంటూ పై అధికారులకు సమాచారం ఇవ్వడం వెనుక అనేక శక్తులు పనిచేసేయని గుసగుసలు వినిపిస్తున్నాయి… చివరకు నాలుగు రోజుల తర్వాత మహిళా సంఘాల ఫౌండేషన్ సభ్యులు భాదిత మహిళను కలిసి జరిగిన అన్యాయంపై తెలుసుకొని, బుచ్చి సీఐతో, అనంతరం నెల్లూరు రూరల్ ఇన్చార్జి డిఎస్పి గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి తో మాట్లాడి, బాధిత మహిళను తమ వాహనం లో తీసుకెళ్ళి నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా వైద్యులు పరీక్షించి ఆమె కుడి చెవి తీవ్రంగా దెబ్బతిన్నని వినికిడి సమస్య ఏర్పడిందని తెలిపారు. ఇప్పటి కైనా పోలీసులు బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడాలి అని ప్రజలు కోరుతున్నారు. ఇంత పెద్ద సంఘటన లో మానవ హక్కుల ఉల్లంఘనే కాదు మహిళ మాన ప్రాణాలకు ముప్పు ఏర్పడితే పోలీసులు స్పందించే తీరు ఇదేనా? సమాజం స్పందించే తీరు ఇదేనా? ఇప్పటికైనా డబ్బు,కులం మతం హోదా లను చూసి కాకుండా ఒక మనిషిగా భారతీయ పౌరులుగా రాజ్యాంగం అందరికీ సమానం గా అమలు అయ్యేలా చూడలిసిన బాధ్యత అధికారులపై వుంటే సమాజం లో నిస్సహాయం గా వున్న వారి పట్ల కాస్త మనుషుల్లా గా మెలగాలి… ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :