- 21 దేవాలయాల్లో…. 21 రకాల పూజ సామాగ్రి పంపిణీ
- రెండు నెలలకు సరిపడా పంపిణీ
- సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
ఈ నెల 8న శివరాత్రిని పురస్కరించుకొని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నేనుసైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పూజా సామాగ్రిని పంపిణీ చేశారు.
ధూప, దీప, నైవేద్యానికి నోచుకోని పలు పురాతన దేవాలయాలకు తమ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పూజా సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న శివాలయం తో పాటు శెట్టి కాంప్లెక్స్ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయం, పెనుగొండ హనుమాన్ దేవాలయం, బి కే రెడ్డి కాలనీ హనుమాన్ దేవాలయంతో పాటు భూత్పూరులోని ముని రంగస్వామి దేవాలయం, మూసాపేట మండలంలోని శివాలయం హనుమాన్ దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంతో పాటు మార్కండేయ స్వామి దేవాలయంలో పూజ సామాగ్రిని పంపిణీ చేయడం జరిగిందని ప్రవీణ్ తెలిపారు. వీటితోపాటు జడ్చర్ల మండలంలోని త్రినేత్ర దశబుజ వీరాంజనేయ స్వామి దేవాలయం నవాబ్ పేట్ లోని వీరభద్ర స్వామి దేవాలయం, జడ్చర్ల, గంగాపూర్ మండలాలతో పాటు బీచుపల్లి మండలం గుర్రం గడ్డ దేవాలయాల్లో మొత్తం 21 దేవాలయాల్లో 21 రకాలైనటువంటి పూజ సామాగ్రిని పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
దేవాలయంలో ప్రతిరోజు నిత్యం పూజకు అవసరమయ్యే ధూపం, దీపం నూనె, కర్పూరం, అగరవత్తులు తోపాటు మొత్తం 21 రకాలైన పూజ సామాగ్రిని పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
ఏ ఒక్కరి నుండి ఒక్క రూపాయి చందాలు వసూలు చేయకుండా స్వచ్ఛందంగా తమ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు రెండు నెలలకు సరిపడా పూజా సామాగ్రిని పలు దేవాలయాలకు పంపిణీ చేసినట్లు ప్రవీణ్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గణేష్ రావు, రెయిన్ బో శ్రీనివాస్, హరి సెట్, శివుడు, శ్రీధర్, పాషా, ఆంజనేయులు, రామస్వామి, రామాంజనేయులు, శెట్టి శ్రవణ్, గడ్డం మయీ, ఆస్కాని నరేందర్, అశోక్ దొర, సంపత్, లక్ష్మణ్, కొంగరి శ్రీనివాస్, విశ్వస్, తిరుపతయ్య గౌడ్, మధులతో పాటు ఆయా దేవాలయాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.