మంచాల జిల్లా చెన్నూర్: ఎస్సీ నియోజకవర్గాలైన చెన్నూరు, బెల్లంపల్లి, ధర్మపురి లో నేతకాని వర్గానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని మంచిర్యాల జిల్లా నేతకాని హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రాంటెంకి పోచం డిమాండ్ చేశారు. మూడు నియోజకవర్గాల్లో దాదాపు 75 శాతం ఓటర్లు తమ వర్గానికి చెందిన వారే ఉన్నారని, తమకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలకే పట్టం కట్టి, వారి గెలుపుకు కృషి చేస్తామని పోచం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జాడి శ్రావణ్ కుమార్, జనగామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.