contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ సభలో పాల్గొన్న మంత్రి జూపల్లి

నాగర్ కర్నూలు  : తెలంగాణ రాష్ట్రంలో గౌడ కులస్తులకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రణాళికబద్ధంగా ముందుకు పోతామని రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత ఆర్ అండ్ బి అతిధి గృహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గౌడ కులస్తుల ఆరాధ్యుడు సర్దార్ సర్వాయి పాపన్న కాంస్య విగ్రహాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. అనంతరం స్థానిక సాయి గార్డెన్ లో ఏర్పాటుచేసిన సభలో జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పౌరుషానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. గౌడ సమాజం ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలన్నారు. కల్లు గీత కార్మిక వృత్తిలో ఉన్న ఇబ్బందులు తనకు బాగా తెలుసునని కార్మికుల సంక్షేమం కోసం వారి రక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈత చెట్లు ఎక్కి కల్లు సేకరించే కార్మికుల కోసం సేఫ్టీ కిట్లను అందిస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో కల్లుగీత కార్మిక సహకార సంఘాలకు 5 ఎకరాల చొప్పున ఈతవనాలు పెంచడానికి భూములు అందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం కూడా అవకాశం ఉన్నచోట్ల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే వనాలను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి తోడు సాగునీటి ప్రాజెక్టుల కాలువల ఇరువైపులా ఆనకట్టలపై చెరువులు కుంటల ఆనకట్టలు చుట్టుముట్టు ఈత తాటి వనాలలు ఖర్జూర చెట్లను పెంచడానికి కృషి చేస్తామన్నారు. హరితహారం కార్యక్రమంలో ఇప్పటికే ఈత చెట్లను నాటడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఒక ప్రణాళికబద్ధంగా తక్కువ సమయంలో ఎక్కువ కల్లు అందించే మేలురకం చెట్లను అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. గీత కార్మికులు ఈ ఒక్క వృత్తినే కాకుండా ఇతర వృత్తులు వ్యాపారాలపై కూడా దృష్టి సారించాలన్నారు. గౌడ కులస్తుల పిల్లలను మంచిగా చదివించాలని ప్రభుత్వ ఉద్యోగాలే కావాలని చదివించడం కన్నా ఇతర రంగాలలో స్థిరపడే విధంగా ఉన్నత విద్యను తమ పిల్లలకు అందించేందుకు ముందుకు రావాలన్నారు. సాఫ్ట్ వేర్ రంగాలతో పాటు ఇతర రంగాలలో దేశ విదేశాలలో ఉపాధి అవకాశాలు పొందవచ్చు అన్నారు. 70 ఏళ్లుగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే ఒక్క హైదరాబాదులో సాఫ్ట్వేర్ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్ లో చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గౌడ సమాజం తలెత్తుకొని జీవించే విధంగా ముందుకు రావాలన్నారు. గత ప్రభుత్వం మద్యం దుకాణాలను 15% గౌడ కులస్తులకు కేటాయించడం జరిగిందని తమ ప్రభుత్వం సొసైటీలకు మద్యం దుకాణాలను అందించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఒకరికి దుకాణం కేటాయిస్తే ఒక కుటుంబమే బాగుపడుతుందని సొసైటీ లకు దుకాణాలు అందిస్తే అందులోని సభ్యులంతా బాగుపడతారన్నారు. కల్లుగీత కార్మికులకు మోపెడ్ వాహనాలు, ఇతర సంక్షేమ ఫలాలు అందించడానికి కృషి చేస్తామన్నారు. గౌడ కులస్తుల అభ్యున్నతి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జూపల్లి అన్నారు. కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందించడమే కాకుండా తాటి బెల్లం తయారీ నీరా తయారీ ఇతర ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామన్నారు. గౌడ కులస్తులు తెలుత్తుకొని జీవించేలా కృషి చేస్తామని అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తన హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి గౌడ కులస్తుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు. మద్యం దుకాణాలలో గౌడ కులస్తులకు 15% దుకాణాల కేటాయింపు, కోటి 20 లక్షల ఈతా తాటి చెట్ల పెంపకం డ్రిప్ ఇరిగేషన్ వంటి పథకాలను అందించడం జరిగిందన్నారు. తాను ఐదేళ్లు మంత్రిగా ఉండి గీత కార్మికుల వృత్తిపై చీమ వాల నీయలేదన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై స్వర్గీయ వెంకట స్వామి విగ్రహం పక్కన ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. గౌడ జాతి మెలు కోసం కలిసికట్టుగా పాటుపడాలని కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు ఎమ్మెల్యేలు గౌడ ప్రజా ప్రతినిధులు కుల సంఘాల నాయకులకు శ్రీనివాస్ గౌడ్ కోరారు. 32 కోట్లను జయించి 24 చెరువులను తవ్వించిన గొప్ప ధీరుడు పాపన్న చరిత్రలో ఆయన పేరును రాకుండా కొందరు కుట్రపన్నారని శివాజీ మహారాజుకు తీసిపోని విధంగా కోటలను స్వాధీనం చేసుకొని రాజుల పాలనను అంతమొందించి తాను రాజుగా ఈ ప్రాంతాలను ఏలాడన్నారు.శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న చరిత్రను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. సర్వాయి పాపన్న సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని పోరాడిన గొప్ప మహనీయుడన్నారు. కలుగీత కార్మికులకు వాహనాలతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అందించాలని కోరారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సొసైటీలకు ఇచ్చిన ఐదు ఎకరాల భూమి పథకాన్ని కొనసాగించాలని కోరారు. ఒక గౌడ కులం బాగుపడితే ప్రత్యామ్నాయంగా ఎనిమిది కులాలు బాగుపడతాయని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గీత కార్మికులకు సేఫ్టీ కిట్లను అందించడం అభినందనీయమన్నారు. మాజీ ఎంపీ మధుయాసి గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పెన్నిధి అన్నారు. అధికారంలో వచ్చిన వెంటనే గీత కార్మికుల సేఫ్టీ కోసం కిట్లను అందించారన్నారు. ప్రభుత్వ భూముల్లో ఈతవనాలు పెంచడానికి అవకాశం కల్పించాలని, కల్తీకల్లు పేరుతో కలు దుకాణాలను బంద్ చేయవద్దని కోరారు. ఎస్సీ ఎస్టీ బీసీ ల సామాజిక న్యాయం కోసం సర్వాయి పాపన్న యుద్ధం సాగించారన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో జనగణన కులగన చేపట్టాలని నిర్ణయించారన్నారు. తెలంగాణలో మొదటి అసెంబ్లీ సమావేశాలలోనే ఇందుకోసం తీర్మానం చేయడం అభినందనీయమన్నారు. స్థానిక సంస్థల లో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు అన్నారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, డాక్టర్ కూచకుల్లా రాజేష్ రెడ్డి లు మాట్లాడుతూ సర్దార్ పాపన్న ఈ సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం సాగించారని అన్నారు. ఐదుగురు మొగల్ రాజుల సామ్రాజ్యాన్ని పతనం చేసిన గొప్ప ధీరుడు అన్నారు. 380 సంవత్సరాల క్రితం ఆయన సాగించిన పోరాటాన్ని నేడు స్మరించడం అభినందనీయమన్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో ఆయన చరిత్రను ఆంగ్లేయులు భద్రంగా పెట్టడం వల్ల ఆయన స్ఫూర్తి ఈ సమాజానికి తెలిసి వచ్చిందని రాజేష్ రెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడు మండలాలను సర్వాయి పాపన్న విగ్రహాలు ఉన్నాయని మిగతా మండలాల్లో కూడా విగ్రహాలను ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కూచుకుల్ల దామోదర్ రెడ్డి, గోరేటి వెంకన్న గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లయ్య గౌడ్, సూర్య ప్రతాప్ గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజ్ గౌడ్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్లు కల్పనా భాస్కర్ గౌడ్, ఆనంద్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ కొండల్ గౌడ్, గౌడ సంఘం నాయకులు మాజీ ఎమ్మెల్యే వంగా మోహన్ గౌడ్, వంగా ఫకీరయ్య గౌడ్, మాజీ జెడ్పిటిసి బాలా గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వంగా లక్ష్మణ్ గౌడ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పెబ్బేటి నిరంజన్ లతోపాటు గౌడ సంఘం నాయకులు ప్రజా ప్రతినిధులు వివిధ సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :