- కలెక్టర్, నాగ్ ఆశ్విన్ తో కలిసి పాఠశాల అదనపు గదుల ప్రారంభంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
- భారతదేశ పేరును కల్కి సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాటిన ప్రముఖ దర్శకుడు
నాగ్ అశ్విన్
నాగర్ కర్నూల్ : తాడూరు మండలంలోని తన స్వగ్రామం ఐతోల్ పాఠశాలలో నాగ్ అశ్విన్ సొంత డబ్బులతో నిర్మించిన అదనపు గదులను జిల్లా కలెక్టర్ సంతోష్ , డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న వయసులోనే అపార మేధాశక్తితో నాగ్ అశ్విన్ ఈరోజు ప్రపంచ స్థాయిలో భారత దేశ చరిత్రను కల్కి సినిమా ద్వారా చాటారని ప్రశంసించారు. చిన్న పల్లెటూరు నుంచి ప్రపంచానికి తన శక్తిని నిరూపించిన నాగ్ అశ్విన్ ని యువత, విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సొంత ఊరికి సేవ చేయాలని భావిస్తున్న నాగ్ అశ్విన్, ఆయన కుటుంబీకులకు అభినందనీయులు తెలిపారు .