సంగారెడ్డి: సుల్తాన్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు నిర్మాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా నిర్మాణ్ ఫౌండేషన్ అధ్యక్షులు ఏలే వెంకటనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఉపాధ్యాయులు సూచించిన విధంగా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి గారు మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా నిర్మాణ్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు తమ వంతు సహకారం ఫౌండేషన్ కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, సంఘసేవకురాలు శ్రీలత, ఫౌండేషన్ సభ్యులు శ్రీకాంత్ కాకరపర్తి, వనం ప్రకాష్ మరియు వడ్డేపల్లి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.