వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఆధ్వర్యంలో ఈ నెల 17 సోమవారం న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద అఖిలపక్షంతో కలిసి నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడుతున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కార్యాలయం లో, జిల్లా అధ్యక్షులు కాశీ సతీష్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ,, టి సేవ్ ఉద్యమంలో భాగంగా చేపడుతున్న నిరాహార దీక్ష కార్యక్రమానికి. అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు అన్నీ విభాగాల జిల్లా అధ్యక్షులు,పట్టణ, మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు కార్యకర్తలకు అధిక సంఖ్యలో పాల్గొనాలనికోరారు. పార్టీలకు అతీతంగా సాగుతున్న ఈ దీక్షకు విధిగా హాజరై, నిరుద్యోగులకు బాసటగా నిలబడాలని , దీక్షకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు తప్పక హాజరు కావాలి అని జిల్లా అధ్యక్షులు కాశి సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ జితేందర్ , జిల్లా అధికార ప్రతినిధి దాగం సుధారాణి, జిల్లా కార్యదర్శి నీలం సంతోష్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు గాదె సాయికుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి , ఎండి సర్వర్ జిల్లా యూత్ నాయకులు బోడ తేజ తదితరులు పాల్గొన్నారు.