నిజామాబాద్ జిల్లా ప్రజల మన్ననలను అతికొద్ది కాలంలోనే 15 నెలలు పొందిన పోలీస్ కమిషనర్ గా కేర్ నాగరాజు తనదైన సైజులో విధులు నిర్వహించి కమిషన్ పరిధిలో క్రైమ్ రేట్ ను తగ్గించాలని వెస్ట్ జోన్ ఐ.జి ఎస్. చంద్రశేఖర్ అన్నారు.
శుక్రవారం నాడు ఉదయం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సమావేశ భవనం నందు నిజాంబాద్ కమిషనర్ కేఆర్ నాగరాజు పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కమిషనర్ గా కే.ఆర్ నాగరాజు సిబ్బంది సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలిగారని అన్నారు. ప్రతి ఒక్క అధికారి వీరిని ఆదర్శప్రాయంగా తీసుకుని విధులు నిర్వహించాలని అన్నారు. అనంతరము పుష్పగుచ్చముతో శాలువా కప్పి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో అదిలాబాద్, జగిత్యాల, నిర్మల్ ఎస్పీలు ఉదయ్ కుమార్, భాస్కర్ ,ప్రవీణ్ కుమార్, కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు