నెల్లూరు జిల్లా. ఆత్మకూర్ : భారీ కొండచిలువ నుండి తప్పించుకొని ఓ వ్యక్తి ప్రాణాప్రాయం నుండి బయటపడి సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం గండ్లవీడు గ్రామంలో చోటుచేసుకుంది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గండ్లవీడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కాలినడకన వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కొండచిలువ అతని కాళ్లకు చుట్టుకుంది. అతను భయంతో కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడి చాకచక్యంగా కొండచిలువను హతమార్చారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.