నెల్లూరు జిల్లా: మర్రిపాడు మండలంలోని చుంచులూరు గ్రామంలో శ్రీ అంకమ్మ,మల్లెంకొండేశ్వర స్వామి వార్ల తిరునాళ్లు ఘనంగా ముగిశాయి.తిరునాళ్ళ లో భాగంగా నేడు పొంగళ్ళు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.మహిళలు భక్తిశ్రద్ధలతో పొంగళ్ళు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు.అనంతరం విచ్చేసిన భక్తులందరికీ సామూహిక విందు భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ తిరునాళ్ల మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కోరేపు కుటుంబసభ్యులు,బంధుమిత్రులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
