నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపింది.. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బాలుడికి తీవ్ర జ్వరంతో నెల్లూరులోని నారాయణ హాస్పిటల్ లో చేరగా అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం చెన్నై తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. జికా వైరస్ ఉన్నట్లు కేవలం అనుమానం మాత్రమేనని ఇంకా పూర్తి వైద్య పరీక్షల రిపోర్టులు రావాలని ప్రజలు వదంతులను నమ్మవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రామనాథరావు తెలిపారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సర్వే చేపట్టారు. దోమల ద్వారా ఈ జికా వైరస్ వ్యాప్తి చెందుతుందని వాటి నివారణకు తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు