నెల్లూరు జిల్లా : మర్రిపాడు మండలం లోని వెంకటాపురం గ్రామంలో జికా వైరస్ లేదని,జిల్లా అధికారుల సూచన మేరకు మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ గోపినాథ్ మీడియా కి తెలిపారు.ఈ సందర్బంగా డాక్టర్ గోపినాథ్ మాట్లాడుతూ వారం రోజుల క్రితం ఆరేళ్ల బాలుడికి జిక వైరస్ లక్షణాలు ఉన్నాయని అనుమానంతో చెన్నైకి తరలించారు.దీంతో ఒక్క సారిగా ఉలిక్కి పడ్డ జిల్లా వైద్యశాఖ బాలుడితో సహా మరో 22 మంది గ్రామస్థుల బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పరీక్షలు కొరకు మహారాష్ట్ర లోని పూణే ల్యాబ్ కు పంపించడం జరిగిందని అన్నారు. ల్యాబ్ పరీక్షల్లో మొత్తం 22 మందికి నెగిటివ్ రావడంతో ఎవరికి జికా వైరస్ లేదని పూణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ NIV సంస్థ వెల్లడించిందని అన్నారు. దీంతో మండలంలో వైరస్ వదంతులతో వారం రోజులుగా తీవ్ర భయాలందారులకు గురైయ్యారు. వెంకటాపురం గ్రామస్తులు కూడా జికా వైరస్ లేదని అధికారులు తెలియజేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమ దరి చేరకుండా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ గోపినాథ్ మండల ప్రజలనుద్దేశింది అన్నారు..