నెల్లూరు జిల్లా, మర్రిపాడు : మర్రిపాడు మండలంలోని డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద ఎస్సై శ్రీనివాసరావు శనివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు, ఓవర్ లోడ్ తో వెళ్తున్న వాహనాలకు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడ్డ వాహనదారులకు జరిమానాలు విధించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని అదే విధంగా కారులో ప్రయాణించేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా మండల పరిధిలోని హైవేలపై గేదెల వల్ల ప్రమాదాలు జరిగితే సంబంధిత గేదెల యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
