నెల్లూరు జిల్లా,మర్రిపాడు లోని ఎంపిడిఓ కార్యాలయంలో ఐసిడియస్ సిడీపీఓ అద్వర్యంలోకిషార్ బాలికల వికాసం పై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపిడిఓ నాగేశ్వర రావు పాల్గొనడం జరిగినది. కౌమారదశలో అందులో వచ్చే మార్పులు గురించి మాట్లాడుతూ ప్రధానంగా రుతూస్రావం వ్యక్తిగత పరిశుబ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే హెల్త్ సీ హెచ్ ఓ మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం, ఆహార,నాణ్యమైన విద్య నాణ్యమైన విద్య లింగ వివక్షణ, లైంగిక వేదింపుల నుంచి రక్షణ తదితర అంశాల గురించి వివరించారు. సి డీ పీ ఓ పద్మలత మాట్లాడుతూ బాల వివాహాలను ఆరికట్టుట ఆశ్రము నుండి రక్షణ పొందడానికి ఆత్మ రక్షణా నైపుణ్యాలు పెంపొందించు కొనడానికి సమాజంలో తన గుర్తింపును పొందుటకు తగిన ఉపాధి కలిగి ఉండాలని తెలిపారు. బాల్య వివాహాల వలన కలిగే నస్టాలను వివరించారు. ఈ కార్య క్రమంలో ఎంపిడిఓ నాగేశ్వర ప్రసాద్ హెల్త్ సీ హే చ్ , ఐ సి డి ఏస్ సూపర్ వైజర్,ఏ ఎన్ ఎం లు అంగన్వాడీ టీచర్లు, వెర్చర్ అసిస్టెంట్లు, మరియు తదితరులు పాల్గొన్నారు.
