నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఉచిత పశు వైద్య శిబిరాలు జనవరి 31 వరకు జరుగుతాయని పశుసంవర్ధక శాఖ ఏడి డాక్టర్ గురు జయంతి తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ తిక్కవరం,ఇర్లపాడు, రామానాయుడుపల్లి పంచాయితీలలో ఉచిత శిబిరాన్నిప్రారంభించి,దూడలకు నట్టల నివారణ మందులను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు అనుకూలించక పశువులు రోగాల బారినపడి మృత్యువాత పడటంతో రైతు ఆర్థికంగా చితికి పోతున్నారు. రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. పశువులు దూడలు సన్న జీవాలకు నట్టల నివారణ మందులను ఉచితంగా ఇటీవల బరువు పెరిగి ఆరోగ్యంగా ఉంటాయని, పాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. గొర్రెలు మేకలకు బొబ్బ వ్యాధి నివారణకు టీకాలు ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. పశువులు గొర్రెలు మేకలకు సమస్య వచ్చిన మా దృష్టికి తీసుకువచ్చి న పరిష్కరిస్తామన్నారు. పశువుల యజమానులు ఈ ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.
