నెల్లూరు జిల్లా : సంగం లో తుఫాన్ ప్రభావం తో కురిసిన భారీ వర్షాలకు సంజీవరాయుడు అనే కూరగాయల దుకాణం వ్యాపారి తీవ్రంగా నష్టపోయారు.అమ్ముకునేందుకు తెచ్చిన 310 ఎర్రగడ్డ బస్తాలు వర్షాలకు తడిసి కుళ్లిపోయి..మొలకలు వచ్చాయి.దాంతో వ్యాపారి కొన్ని ఎర్రగడ్డ బస్తాలను రహదారి డివైడర్ పై ఆరపెట్టాడు.మరికొన్ని మిద్దె పై ఆరబోశాడు. ఇంకా ఆ ఎర్రగడ్డలు అమ్ముకునేందుకు పనికిరావని వాపోయారు.సుమారు 2 లక్షల రూపాయిల కు పైగా నష్టపోయానని తెలిపారు. తెచ్చినప్పటినుండి వర్షాలు పడడంతో ఎర్రగడ్డ బస్తాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.