నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళలకు బీసీ కార్పొరేషన్ కింద ఏర్పాటుచేసిన కుట్టు మిషన్ ఉచిత శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.నియోజకవర్గంలో టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాలకు చెందిన మహిళలందరికీ ఉచిత ట్రైలర్ శిక్షణతో పాటు ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఉచితంగనే కుట్టుమిషన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో 7 కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి, 90 రోజులపాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ పొట్ట బ్రహ్మానందరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు ఆరికట్ల జనార్దన్ నాయుడు, మాజీ మండల అధ్యక్షులు శాఖమూరి నారాయణ, గంగవరపు శ్రీధర్ నాయుడు, వెంకట్ చౌదరి, గంగినేని శ్రీనివాసన్ నాయుడు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.