- దేశ వ్యాప్తంగా ‘డిమాండ్స్ డే’ గా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి
అదానీ గ్రూపు కంపెనీల అవినీతి, తప్పిదాలు, క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై దర్యాప్తు చేయాలని, అందుకోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని, మణిపూర్ హింసాత్మక పరిస్థితులపై పార్లమెంటులో చర్చ జరపాలని, సాయుధ బలగాల ప్రత్యేక రక్షణ చట్టం (పిఎఫ్ఎఎసిపిఎ) ఉపసంహరించాలని, అధిక ధరలను అరికట్టాలని, నిరుద్యోగం నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ, జిడిపి తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నెల 9వ తేదీన దేశ వ్యాప్తంగా ‘డిమాండ్స్ డే’ గా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సిపిఐ జాతీయ సమితి పిలుపునిచ్చింది. బుధవారం స్థానిక భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయం జె వి భవనం నందు మండల కార్యదర్శుల శాఖా కార్యదర్శులు ఏరియా కార్యవర్గసభ్యుల సమావేశం రవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గాలి చంద్ర గారు పాల్గొనడం జరిగింది. ఆయన మాట్లాడుతూ అమెరికాలోని న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టులో అదానీపై అవినీతి కేసు నమోదయ్యింది. విద్యుత్ ఒప్పందాల కోసం దాదాపు రూ.2100 కోట్లు మన దేశంలోని 4 రాష్ట్రాలలో అదానీ లంచాలుగా ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో అత్యధికభాగం రూ.1750 కోట్లు మన రాష్ట్రంలోనే గత ప్రభుత్వ హయాంలో ముడుపులుగా ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఫలితంగా 25 సంవత్సరాలపాటు రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయల మేర విద్యుత్ చార్జీల భారం మోపబడుతుంది. పార్టీ జాతీయ సమితి తెలిపిన డిమాండ్స్ తోపాటు మన రాష్ట్రంలో అదానీ అవినీతి కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని, గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో అదానీతో చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అదానీని తక్షణమే అరెస్టు చేయాలని ఈ అవినీతిపర్వంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేయాలి. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీర శేఖర్,ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్,పట్టణ కార్యదర్శి పి బాలు, ఏరియా కార్యవర్గ పడిగ వెంకటరమణ, ఇమ్మానుయేల్, విజయమ్మ,పెంచలయ్య జాకోబు,మండల కార్యదర్శిలు ప్రసాద్, శేషారెడ్డి, న్యాయ ఏరియా నాయకులు బండి అనిల్, నవీన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.