నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో జాతీయ వికలాంగుల దినోత్సవం మెప్మా సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ పలువురు వికలాంగులను శాలువాతో సత్కరించి వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గంగా ప్రసాద్ మాట్లాడుతూ డిసెంబరు మూడో తేదీన ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిన్న నెల్లూరులో జిల్లా కలెక్టర్ నిర్వహించారని తుఫాను కారణంగా ఆత్మకూరులో భారీ వర్షం కురవడం వలన ఆత్మకూరులో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆత్మకూరులో మొత్తం 17 వికలాంగుల పొదుపు గ్రూపులు ఉన్నాయని వీరికి ప్రభుత్వం ద్వారా లోన్లు మంజూరు చేసి ఆర్థికంగా వారు అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మెప్మా టీ.ఏం.సి. మాధవి మరియు ఆర్.పి. సభ్యులు. గ్రూపు లీడర్లు. మొదలగు వారు పాల్గొన్నారు.