నెల్లూరు జిల్లా : మర్రిపాడు మండలం కదిరినేనిపల్లి గ్రామంలో మంత్రి ఆనం సార్, కలెక్టర్ సార్ మాకు రోడ్డు వేయండి సార్ అంటు ఆవేదన చెండుతున్నారు. ఈ మాటలు అన్నది గ్రామ ప్రజలు కాదు స్వయాన కదిరినేనిపల్లి గ్రామం ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు. ఇక్కడ చదివే విద్యార్థుల అవస్థలు అధికారులకు పట్టడం లేదు. ఎందుకంటే గత వారం రోజులుగా ఇక్కడ కురుస్తున్న వర్షాలకు రోడ్లపై వర్షపు నీరు నిలిచి బురదమయంగా తయారయ్యాయి. ఎటు చుసిన వర్షపు మురికినీరు చుట్టూ ముట్టి నడవలేని స్థాయిలో బురద ఉండటంతో తప్పని పరిస్థితిలో చిన్నారులు పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంటి నుంచి శుభ్రంగా రెడీ అయ్యి పాఠశాలకు వెళ్లే లోగా విద్యార్థుల బట్టలకు చెప్పులకు బురదమయం కాగా తీవ్ర దుర్వాసన వెదజల్లుతుందని పక్క పక్కన కూర్చోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుందని విద్యార్థులు అంటున్నారు. పాఠశాల కి వెళ్తున్న విద్యార్థులు అవస్థలు గ్రామస్థాయిలో సర్పంచ్ గాని నాయకులు గాని మండల స్థాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గాని, రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందిస్తారా లేదా వేచి చూడాలి.
