contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మెగా పేరెంట్ .. చర్ సమావేశానికి రండి : ప్రిన్సిపాల్ల క్ష్మీదేవి

నెల్లూరు జిల్లా : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా పేరెంట్ టీచర్ సమావేశం మండల కేంద్రమైన మర్రిపాడు కెజిబీవి స్కూల్ లో 7వతేది శనివారం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సిహేచ్ లక్ష్మి దేవి ఒకప్రకటనలో తెలియజేసారు. పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిర్వహించే భారీ సమావేశానికి ప్రజా ప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు, పుర ప్రముఖులు, గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ప్రిన్సిపాల్ లక్ష్మి దేవి కోరారు. పాఠశాల విద్యార్థునిలు తయారుచేసిన ఆహ్వాన పత్రికలతో అందరినీ ఆహ్వానించడం జరిగిందన్నారు. స్కూల్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిలకు హెూలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నట్లు వివరించారు. ప్రతి విద్యార్ధిని పాఠ్యాంశాల ప్రగతితో పాటు, విద్యార్థునిల్లో దాగివున్న నైపుణ్యం, ఆటలు, క్రీడలులాంటి విన్యాసాలలో ప్రావీణ్యత, తోటి విద్యార్థునిలతో ప్రవర్తన, భావవ్యక్తీకరణ, పరస్పర సహకారం, నాయకత్వ లక్షణాలు తదితర విషయాలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి సమావేశంలో చర్చించేలా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. విద్యార్ధులో దాగి వున్న ప్రతిభను గుర్తించి ఆ మేరకు శిక్షణ ఇచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా ప్రతి విద్యార్థి యొక్క ఆరోగ్యానికి కూడా పరీక్షించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సంబంధిత విషయాలను కూడా తెలియజేయడం జరుగుతుందన్నారు. స్క్రీన్ టెస్ట్ లు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని వివరించారు. పూర్వ విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారి సలహాలు, సహకారం తీసుకొని పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో హాజరైన ఆహ్వానితులందరికీ శుభదిన్ భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 7వ తేదీన పండుగ వాతావరణంలో నిర్వహించుకొనే మెగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భారీ సమావేశానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి దేవి, టీచింగ్ &నాన్ టీచింగ్ ఉపాధ్యాయునీలు, విద్యార్థునిలు కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :