నెహ్రూ యువ కేంద్ర,నెల్లూరు వారు నిర్వహించినటువంటి డివిజనల్ స్థాయి క్రీడా పోటీల్లో నందవరం మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. నేడు ఆత్మకూరు లో జరిగిన పోటీలలో కోకో క్రీడలో బాలికల జట్టు రన్నరప్ గా నిలవగా, 100 మీటర్ల పరుగు పందెంలో పుష్ప రెండవ స్థానం కైవసం చేసుకుంది.బాలుర 100మీటర్ల పరుగు పందెం విభాగంలో లోకేష్ రెండవ స్థానం లోనూ, మనోజ్ తృతీయ స్థానం లోనూ నిలిచి సత్తా చాటారు.వీరు ఈ నెలాఖరులో జరిగే జిల్లా స్థాయి క్రీడా పోటీలలో పాల్గొననున్నారు.విజేతలకు నెహ్రూ యువ కేంద్రం వారు ట్రోఫీ, మెమోంటో, ప్రశంసా పత్రం అందజేశారు. గెలుపొందిన క్రీడా కారులను ప్రిన్సిపాల్ లక్ష్మీ నారాయణ,అధ్యాపక బృందం వ్యాయామ ఉపాధ్యాయులు ఆఫ్రోజ్ తదితరులు అభినందించారు.